Suyash Prabhudessai likely to replace Virat Kohli: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు. జనవరి 25న ఆరంభం అయ్యే తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ రెండు టెస్టులకు విరాట్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విరాట్ కోహ్లీ స్థానంలో ప్రధానంగా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా.. దేశవాళీ స్టార్స్ రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ ఉంది. పటీదార్ ఇటీవల భారత్-ఎ తరఫున ఇంగ్లండ్‌తో అనధికార టెస్టులో భారీ సెంచరీ (151) చేశాడు. అదే మ్యాచ్‌లో సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ బాదాడు. పుజారా ఇటీవల పెద్దగా రాణించకపోవడంతో సెలక్షన్ కమిటీ అతడి వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువే. అయితే అనుభవం దృష్ట్యా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: BCCI Awards 2024: శుభ్‌మన్ గిల్, రవిశాస్త్రిలకు బీసీసీఐ అవార్డులు!
ఈ ముగ్గురిని కాకుండా.. బీసీసీఐ సెలెక్టర్లు మరో ఆటగాడి పేరును కూడా పరిశీలీస్తున్నట్లు తెలుస్తోంది. దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న గోవా ఆటగాడు సుయాస్ ప్రభుదేశాయ్‌ను విరాట్ కోహ్లీ స్థానంలో ఆడించాలని చూస్తున్నారట. రంజీ ట్రోఫీ 2024లో సుయాస్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 386 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. 29 మ్యాచ్‌ల్లో 47.97 సగటుతో 2015 పరుగులు చేశాడు. రేసులో నలుగురు ఉన్నా.. ప్రధాన పోటి పటీదార్, ప్రభుదేశాయ్ మధ్యనే ఉందట.