బయటి వాళ్లు ఏమన్నా తానేమీ నేనేమీ పట్టించుకోనని.. దేశం కోసం, జట్టు కోసం ఎలా ఆడాలన్నదానిపై ప్రతి ఆటగాడికి కొన్ని అంచనాలుంటాయని టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాలు అందుకోలేనందుకు చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలయ్యే సమయానికి గిల్ పెద్దగా ఫామ్‌లో లేదు. దాంతో అతడిపై చాలా ఒత్తిడే ఉంది. అదేకాకుండా ఓపెనింగ్ స్థానం నుంచి మూడో స్థానానికి మారాల్సి వచ్చింది. అయితే ఒత్తిడిని అధిగమిస్తూ.. మూడు టెస్టులు ముగిసేసరికి ఫామ్‌లోకి వచ్చాడు. మూడు టెస్టుల్లో 252 పరుగులు చేశాడు.
తన బ్యాటింగ్‌లో సాంకేతిక మార్పులేమీ చేయలేదని శుభ్‌మన్ గిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘బయటి వాళ్లు ఏమన్నా.. నేను పెద్దగా పట్టించుకోను. దేశం కోసం, జట్టు కోసం ఎలా ఆడాలన్నదానిపై ప్రతి ఒక్కరికి కొన్ని అంచనాలు ఉంటాయి. నాపై నేను పెట్టుకున్న అంచనాలు అందుకోలేనందుకు నిరాశకు గురయ్యా. అయితే నా దృక్పథంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ నా అంచనాల్లో ఎలాంటి మార్పు లేదు. వైఫల్యాలను మరిచిపోయి ఎంత త్వరగా తర్వాతి సవాల్‌కు సిద్ధమవుతామన్నదే ముఖ్యం. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడడం తప్పనిసరి’ అని గిల్ అన్నాడు.
Also Read: Rashmika Mandanna : రష్మిక న్యూ లుక్ చూశారా?.. వైరల్ అవుతున్న ఫోటోలు..
విశాఖపట్నం టెస్టుకు ముందు 11 ఇన్నింగ్స్‌ల్లో శుభ్‌మన్ గిల్ ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. విశాఖ టెస్టుతో ఫామ్ అందుకున్నాడు. విశాఖలో సెంచరీ చేసిన గిల్.. రాజ్‌కోట్‌లో 91 పరుగులు చేశాడు. మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రాంచిలో నాలుగో టెస్ట్ ఆరంభం కానుంది.