Rohit Sharma takes incredible Catch in IND vs ENG 2nd Test: విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. సూపర్ క్యాచ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతిని.. పోప్ బ్యాక్ ఫుట్ తీసుకుని ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ అంచును తాకుతూ ఫస్ట్ స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్.. వేగంగా స్పందించి సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో పోప్ (23) ఔటయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read: IND vs ENG: 60-70 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తాం.. జేమ్స్ అండర్సన్ షాకింగ్ కామెంట్స్!
ఓలీ పోప్ అనంతరం గాయం కారణంగా మూడో రోజు మైదానం వీడిన స్టార్ బ్యాటర్ జో రూట్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చీరాగానే రివర్స్ స్వీప్‌తో రూట్ బౌండరీ కొట్టాడు. మరో బౌండరీ, సిక్స్ బాది స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆర్ అశ్విన్ బౌలింగ్‌లో (30.6వ ఓవర్) భారీ షాట్‌కు యత్నించిన రూట్ (16) అక్షర్ పటేల్‌కు దొరికిపోయాడు. దీంతో 154 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 39 ఓవర్లకు 184/4. జాక్ క్రాలే (72), జానీ బెయిర్‌స్టో (17) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 215 పరుగులు అవసరం.