Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng Rishabh Pant To Bat Despite Injury 4th Test

IND vs ENG: భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు బ్యాటింగ్‌కు వచ్చేస్తున్నాడు!

Published Date :July 27, 2025 , 10:22 am
By Sampath Kumar
  • కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త
  • పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రిషబ్ పంత్
  • క్రీజులోకి వస్తాడని టీమిండియా ఫాన్స్ ఆశాభావం
  • భారత్.. ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్స్
IND vs ENG: భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు బ్యాటింగ్‌కు వచ్చేస్తున్నాడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rishabh Pant to Bat in Second Innings Despite Injury: మాంచెస్టర్‌లోని నాలుగో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త. జట్టు కోసం గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ విషయాన్ని కోచ్‌ సితాన్షు కొటక్ పరోక్షంగా ధ్రువీకరించాడు. పంత్ తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని తాను అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉంది కాబట్టి అతడు తప్పకుండా క్రీజులోకి వస్తాడని టీమిండియా ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు బ్యాటింగ్ చేస్తుండగా రిషబ్ పంత్ కాలికి గాయమైంది. పేసర్ క్రిస్‌ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్ ఆడగా.. బంతి ముందుగా బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి ఆపై పంత్ కుడి కాలు పాదానికి బలంగా తాకింది. నొప్పి భరించలేక పంత్‌ తన షూ తీయగా.. రక్తం కారింది. బంతి తాకిన చోట వాపు వచ్చింది. ఫిజియో వచ్చి చికిత్స చేసినా నొప్పి తగ్గకపోవడంతో వాహనంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. జట్టు అవసరాల కోసం నొప్పిని భరిస్తూ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. కీపింగ్‌ బాధ్యతలను మాత్రం ధ్రువ్ జురెల్‌కు అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 669 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (87), శుభ్‌మన్‌ గిల్ (78) ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు చివరి రోజు. ఈ టెస్టులో గిల్ సేన ఓడిపోకుండా ఉండాలంటే.. ఆదివారం కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేసి పరుగులు చేయాల్సి ఉంది. రాహుల్, గిల్ తర్వాత ప్రధాన బ్యాటర్‌గా ఉంది రిషబ్ పంత్ మాత్రమే. పంత్‌ తర్వాత ఆల్‌రౌండర్లు జడేజా, ఠాకూర్, సుందర్ బ్యాటింగ్‌ చేస్తారు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ తప్పకుండా బ్యాటింగ్‌ చేస్తాడని సితాన్షు కొటక్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం పంత్ తప్పకుండా బ్యాటింగ్‌ చేస్తాడని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు వచ్చేస్తున్నాడు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

చివరి రోజు ప్రతి బంతి కీలకమే అని, భారత బ్యాటర్లు బాగా ఆడతారని తాను భావిస్తున్నా అని సితాన్షు కొటక్ తెలిపాడు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడమే ఇప్పుడున్న ఏకైక దారి అని పేర్కొన్నాడు. అనవసరమైన రిస్క్‌ షాట్లకు పోకూడదని, క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఇకపై బ్యాటింగ్‌ చేయాల్సిన ఆటగాళ్లంతా నాణ్యమైన క్రికెటర్లే అని చెప్పాడు. పంత్ మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటాడని, తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని సితాన్షు ధీమా వ్యక్తం చేశాడు. పంత్ గాయంకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • Manchester Test
  • Rishabh Pant
  • Rishabh Pant Batting
  • Rishabh Pant Injury

తాజావార్తలు

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions