NTV Telugu Site icon

IND vs ENG: 60-70 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తాం.. జేమ్స్ అండర్సన్ షాకింగ్ కామెంట్స్!

James Anderson

James Anderson

Even if India got 600 England will chase Says James Anderson: భారత్ నిర్ధేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని 60-70 ఓవర్లలో ఛేదించే ప్రయత్నం చేస్తామని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. భారత్ 600 స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందే అని కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడన్నాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మిగిలిన 2 రోజుల్లో ఇంగ్లండ్ విజయానికి ఇంకా 332 పరుగులు చేయాల్సి ఉంది.

మూడో రోజు ఆట ముగిసిన అనంతరం ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ… ‘గత రాత్రి సమావేశం జరిగింది. భారత్ ఎంత పెద్ద స్కోరు చేసినా ఛేజింగ్ చేయాల్సిందేనని అని మా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసినా.. దాన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించాలన్నాడు. మూడో రోజు భారత్ మంచి స్కోరు సాధించింది. ఆటలో ఇంకా 180 ఓవర్లు మిగిలి ఉన్నాయని నాకు తెలుసు. కానీ మేము 60-70లో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము. మేము ఆ విధంగానే ఆడతాము’ అని చెప్పాడు.

Also Read: Virat Kohli: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం!

‘రెహాన్ అహ్మద్ మంచి షాట్స్ ఆడాడు. రేపు కూడా బాగా ఆడాలని చూస్తున్నాడు. నాలుగో రోజు మా ఆట భిన్నంగా ఏమీ ఉండదు. గత రెండు సంవత్సరాలుగా మేము ఆడుతున్న విధంగానే ఆడతాము. మేము గెలిచినా, ఓడినా దూకుడుగానే ఆడుతాం. మేము ఆడే ప్రతి గేమ్‌ను గెలవాలనుకుంటున్నాము. అయితే మేము ఓ నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాము’ అని జేమ్స్ అండర్సన్ తెలిపాడు. సోమవారం ఆట ఆరంభం కాగా.. నాలుగు వికెట్స్ కోల్పోయి 154 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 245 రన్స్ కావాలి.