NTV Telugu Site icon

IND vs ENG: మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగడానికి మేం భయపడం: ఇంగ్లండ్ కోచ్‌

Brendon Mccullum

Brendon Mccullum

Coach Brendon McCullum Hits England Playing 11 vs India: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆతిథ్య భారత జట్టును ఓడించిన విషయం తెలిసిందే. స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బోల్తాకొట్టిద్దామనుకున్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ సూపర్‌ బౌలింగ్‌కు భారత్‌ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. స్పిన్‌కు అనుకూలించే విశాఖ టెస్టులో కూడా పైచేయి సాధించాలని చూస్తోంది. రెండో టెస్టులో తాము ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని ఇంగ్లండ్ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ హిట్ ఇచ్చాడు.

రెండో టెస్టుకు వేదికైన విశాఖలో పిచ్‌ను చూసి, దాన్ని అంచనా వేయాలనే ఆత్రుతతో ఇంగ్లండ్ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ఉన్నాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తే మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగడానికి భయపడమని న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ మెక్‌కలమ్‌ చెప్పాడు. ‘సిరీస్‌లో పిచ్‌లు మొదటి టెస్ట్‌లో మాదిరే స్పిన్ అవుతూ ఉంటే.. మొత్తం స్పిన్నర్లతోనే ఆడడానికి మేం భయపడం. సమతుల్య జట్టుతో బరిలోకి దిగుతాం’ అని సెన్ రేడియోతో మెక్‌కలమ్‌ అన్నాడు.

Also Read: Virat Kohli Brother: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు!

‘షోయబ్ బషీర్ అబుదాబిలో మాతోనే ఉన్నాడు. అతడు తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదించాడు. అతడిది చిన్న వయస్సు, ఫస్ట్-క్లాస్ అనుభవం తక్కువైనప్పటికీ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. జట్టులో చేరగానే మా ప్లేయర్స్ సంతోషించారు. తదుపరి టెస్ట్ మ్యాచ్ కోసం అతడిని పరిగణలోకి తీసుకుంటాం’ అని బ్రెండన్‌ మెక్‌కలమ్‌ తెలిపాడు. మెక్‌కలమ్‌ మాటలను బట్టి చూస్తే.. రెండో టెస్టులో బషీర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది.