Ravichandran Ashwin Set To Play 100 Test: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు సిద్దమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మార్చి 7 నుంచి ధర్శశాల వేదికగా ఆరంభం కానున్న చివరి టెస్టుతో యాష్ ఈ మైలురాయిని అందుకుంటాడు. భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ఆటగాడిగా అశ్విన్ నిలవనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 200 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, చటేశ్వర్ పుజారా లాంటి వారు 100కు పైగా టెస్టులు ఆడారు.
ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకున్న నేపథ్యంలో వరుసగా క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగో టెస్టుకు దూరమైన భారత వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. ఐదో టెస్టుకూ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియరాలేదు. ఒకవేళ చివరి టెస్టుకు రోహిత్, బుమ్రా దూరమైతే.. ఆర్ అశ్విన్‌కు భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించే అవకాశం ఉంది.
Also Read: BCCI Match Fee Hike: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై రూ.20 లక్షలు!
కెరీర్‌లో 100 టెస్టు ఆడనున్న ఆర్ అశ్విన్‌కు గౌరవార్థం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా 100 టెస్టు ఆడుతున్న అశ్విన్‌కు జట్టు పగ్గాలను అప్పజెప్పాలని కోరాడు. చూడాలి మరి ఏం జరుగుగుతుందో. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన అశ్విన్.. 507 వికెట్స్ పడగొట్టాడు. అంతేకాదు 3309 పరుగులు కూడా చేశాడు. యాష్ టెస్టుల్లో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు.