Site icon NTV Telugu

IND vs ENG 4th Test: లైవ్ మ్యాచ్‌ను బొమ్మ‌గా వేసిన చిత్ర‌కారుడు!

Ind Vs Eng 4th Test

Ind Vs Eng 4th Test

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించింది. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 5 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కఠిన సవాళ్లు ఎదరైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్‌ గిల్ (52 నాటౌట్) హాఫ్‌ సెంచరీలు చేయగా.. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్‌ జురెల్ (39 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. రాంచీ పిచ్ అనూహ్యంగా టర్న్ అవ్వడంతో.. ఈ మ్యాచ్ ఇరు దేశాల అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురిచేసింది.

భారత్, ఇంగ్లండ్‌ అభిమానుల‌ను ఉత్కంఠ‌కు గురి చేసిన ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు చెందిన ఆండీ బ్రౌన్ అనే చిత్ర‌కారుడు బొమ్మ‌గా వేశాడు. నాలుగో రోజు లైవ్‌ మ్యాచ్‌ను అతడు కాన్వాస్‌పై చిత్రంగా మ‌లిచాడు. రాంచీ స్టేడియంతో పాటు బౌల‌ర్ బంతి విస‌ర‌డం.. బ్యాట‌ర్‌, ఫీల్డ‌ర్లు సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని ఆవిష్క‌రించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్ల‌తో చెలరేగిన దృశ్యాన్ని కూడా ఆండీ కాన్వాస్‌పై గీశాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Ranji Trophy 2024: 4 పరుగుల తేడాతో పరాజయం.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు ఔట్!

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్, ఇంగ్లండ్‌ల మ‌ధ్య‌ జ‌రిగిన తొలి టెస్టు లైవ్‌ను కూడా ఆండీ బొమ్మ‌గా వేశాడు. లైవ్ క్రికెట్ మ్యాచ్‌ల‌ను బొమ్మ‌గా వేయ‌డం ఆండీ బ్రౌన్‌కు ఇదే మొద‌టిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆండీ తన స్పెష‌ల్ టాలెంట్‌తో అంద‌ర్నీ ఆకట్టుకున్నాడు. ఆండీ ప్ర‌త్యేక‌ నైపుణ్యం చూసిన స్టేడియంలోని ప్రేక్ష‌కులంతా షాక్‌కు గురవుతున్నారు. లైవ్‌ మ్యాచ్‌ను మాత్రమే కాదు.. ఆండీ ఏ దాన్నైనా సునాయాసంగా వేస్తాడు.

Exit mobile version