Site icon NTV Telugu

IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేశాడు!

Ind Vs Eng 3rd Test

Ind Vs Eng 3rd Test

IND vs ENG 3rd Test Playing 11: ఆండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో భాగంగా మరికొద్ది సేపట్లో ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. జోష్ టంగ్‌ స్థానంలో ఆర్చర్‌ ఆడనున్నాడు. ఒక్క మార్పు మినహా రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. మరోవైపు టీమిండియా తరఫున పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో బుమ్రా ఆడనున్నాడు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత్.. ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో విజయం సాధించాలని చూస్తోంది. రెండో టెస్టులో ఓడిన ఇంగ్లండ్ లార్డ్స్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన గత మూడు టెస్టుల్లో రెండింట్లో భారత్ గెలిచింది. ఓ టెస్టులో మాత్రం చిత్తుగా ఓడింది. ప్రస్తుతం ఫామ్ మీదున్న టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ ఎలా రాణిస్తుందో చూడాలి.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.

Exit mobile version