Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయం అయింది. బుధవారం జట్టు శిక్షణా సెషన్‌కు కూడా అతడు హాజరు కాలేదు.
భారత్‌లో పర్యటించిన ఇంగ్లండ్ టెస్టు జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జాక్ లీచ్. విశాఖలో బుధవారం జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయకపోవడంతో.. అతడు రెండో టెస్టుకు దూరమవుతాడని తెలుస్తోంది. ఫిజియో అతడికి చికిత్స చేస్తున్నాడు. విశాఖ టెస్టుకు ఇంకా ఒక రోజు సమయం ఉన్న నేపథ్యంలో లీచ్ కోలుకుంటాడని ఇంగ్లండ్ భావిస్తోంది. ఒకవేళ లీచ్ రెండో టెస్టుకు దూరమైతే.. ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది.
విశాఖ టెస్టులో నలుగురు స్పిన్నర్లను బరిలోకి దిగుతామని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైతే.. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే ఇంగ్లండ్ ఆడనుంది. హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జాక్ లీచ్ 26 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో గాయం అవడంతో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. కీలకశ్రేయాస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.