NTV Telugu Site icon

IND vs BAN Fight: మూసుకుని పెవిలియన్‌కు పో.. భారత్, బంగ్లా ఆటగాళ్ల మధ్య గొడవ!

Ind Vs Ban Fight

Ind Vs Ban Fight

Fight between Soumya Sarkar and Harshit Rana in Emerging Asia Cup Semi-Final: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ 2023లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం బంగ్లాదేశ్‌-ఏతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్-ఏ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.1 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (66) అర్ధ శతకంతో రాణించాడు. స్వల్ప ఛేదనలో బంగ్లా 34.2 ఓవర్లలో 160కే ఆలౌట్ అయింది. ఆఫ్‌స్పిన్నర్‌ నిశాంత్‌ సింధు (5/20) తిప్పేశాడు. ఇక​ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో భారత్ అమితుమీ తేల్చుకోనుంది. అయితే సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ ప్లేయర్స్ మధ్య గొడవ జరిగింది.

సెమీ ఫైనల్లో భారత్ బ్యాటింగ్‌ సమయంలో వికెట్‌ పడిన ప్రతీసారి బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు అతి చేశారు. టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్‌ చేస్తూ.. పెవిలియన్‌ సిగ్నల్‌ పదే పదే చూపించారు. ఒక్కసారి వారి చర్యలు శ్రుతి మించాయి. అయితే భారత యువ ఆటగాళ్లు మాత్రం ఏమీ అనకుండా ఓపిక పట్టారు. టైం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్లు కామ్‌గా ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌ సమయంలో భారత్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. వికెట్‌ కోల్పోయినప్పుడు గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు.

Also Read: Ola S1 Air Pre-Booking: జులై 28 నుంచి ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్స్‌.. వారికి మాత్రం 10వేల డిస్కౌంట్!

బంగ్లాదేశ్‌ సీనియర్‌ బ్యాటర్‌ సౌమ్యా సర్కార్‌.. యువరాజ్‌సిన్హ్‌ దోదియా వేసిన 26వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. రెండో బంతికి సౌమ్యా షాట్‌ ఆడగా.. బంతి సరిగా కనెక్ట్ అవ్వలేదు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న నికిన్‌ జోస్‌.. డైవ్ చేసి మరీ బంతిని అందుకున్నాడు. కీలక వికెట్‌ కావడంతో టీమిండియా యువ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. హర్షిత్‌ రానా అయితే సౌమ్యా మొహం ముందు గట్టిగా అరుస్తూ, పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇది చూసిన సౌమ్యా.. హర్షిత్‌తో గొడవకు దిగాడు.

హర్షిత్‌ రానా, సౌమ్యా సర్కార్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. అంపైర్‌ వచ్చేలోపే దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీశారు. పెవిలియన్ వెళ్లమంటూ సౌమ్యాను సాయి సుదర్శన్‌ పక్కకు తీసుకెళ్లాడు. పెవిలియన్‌ వెళ్తున్న సమయంలోనూ హర్షిత్‌పై సౌమ్యా మాటల యుద్దం కొనసాగించాడు. ఇదంతా కెమెరాలో రికార్డు అయింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారత కెప్టెన్ యష్‌ దుల్‌ ఔటైన సమయంలో సౌమ్యా శ్రుతి మించడమే ఈ గొడవకు అసలు కారణం.

Also Read: Cold And Cough Mistakes: జ్వరం, జలుబు ఉన్నప్పుడు.. ఈ తప్పు అస్సలు చేయవద్దు!