NTV Telugu Site icon

IND vs BAN: హైదరాబాద్ టీ20లో భారీ మార్పులు.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!

Ind Vs Ban Playing 11

Ind Vs Ban Playing 11

IND Playing 11 vs BAN: మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో శనివారం జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో.. బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా కొనసాగనున్నారు. రెండో టీ20లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్ ఆడగా.. సంజూ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనుండగా.. మెరుపు హాఫ్ సెంచరీ చేసిన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కొనసాగనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. హార్దిక్ స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు అవకాశం దక్కనుంది. ఇదే జరిగితే ఉప్పల్ స్టేడియంలో ఇద్దరు తెలుగు ప్లేయర్లు భారత్ తరఫున ఆడతారు.

రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులో కొనసాగనున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో రవి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానములో హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడు. మయాంక్ యాదవ్ కొనసాగనున్నాడు.

Also Read: Gold Rate Today: అంతా అయిపాయె.. పండగ వేళ ‘గోల్డ్’ షాక్!

బంగ్లాదేశ్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.