NTV Telugu Site icon

IND vs AUS Tickets: నవంబర్ 15 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా టికెట్ల విక్రయాలు!

Visakhapatnam Stadium

Visakhapatnam Stadium

India vs Australia Visakhapatnam T20 Match Tickets Sale: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ముగిసిన వెంటనే భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ప్రపంచకప్‌ 2023కి ముందు వన్డే సిరీస్ ఆడిన ఇరు జట్లు.. త్వరలో పొట్టి సిరీస్ ఆడనున్నాయి. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగుతుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్స్ విక్రయాలు నవంబర్ 15 నుంచి మొదలు కానున్నాయి.

ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో నవంబర్ 23న జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ఈ నెల 15 నుంచి ఆరంభం అవుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపీనాథ రెడ్డి తెలిపారు. నవంబర్ 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం లింక్‌ ద్వారా టికెట్స్ విక్రయాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: Cows Trample Devotees: ఆవులతో తొక్కించుకున్న భక్తులు.. కారణం ఏంటంటే?

ఆఫ్‌లైన్‌ టికెట్స్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలలో అందుబాటులో ఉంటాయని ఏసీఏ కార్యదర్శి చెప్పారు. రూ. 600, రూ. 1500, రూ. 2,000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక డిసెంబర్ 3న జరిగే ఐదవ టీ20కి ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఇక్కడే జరుగుతుందో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి.

 

Show comments