Rinku Singh Says My role is to bat in the last 5 overs: యువ ‘ఫినిషర్’ రింకు సింగ్ ఫామ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రింకు మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో రింకు అదరగొట్టేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో లక్ష్య ఛేదన సమయంలో భారత జట్టును గెలిపించిన రింకు.. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ సందర్భంగా 9 బంతుల్లోనే 31 రన్స్ బాదాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ చివరలో క్రీజులోకి వచ్చిన యువ ఫినిషర్ 4 ఫోర్లు, 2 సిక్సులు బాది అభిమానులను అలరించాడు.
రెండో టీ20 మ్యాచ్ అనంతరం రింకు సింగ్ మాట్లాడుతూ.. జట్టులో తన పాత్రపై కచ్చితమైన అవగాహన ఉందని, ఫినిషింగ్ స్కిల్స్‌పై దృష్టి పెట్టా అని తెలిపాడు. ‘నేను కొంతకాలంగా 5-6 స్థానంలో ఆడుతున్నాను. కాబట్టి దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండటానికి ప్రయత్నిస్తాను. బంతిని బట్టి నా షాట్ ఎంపిక ఉంటుంది. బంతిని నిశితంగా గమనించగలిగితేనే.. భారీ షాట్లు కొట్టేందుకు ఛాన్స్ లభిస్తుంది’ అని రింకు తెలిపాడు.
Also Read: Yashasvi Jaiswal: నా తప్పే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
‘కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతం. యువ క్రికెటర్లుగా మేం ఎంతో నేర్చుకుంటున్నాం. మైదానంలో మా ఆటను ఆస్వాదిస్తున్నాం. జట్టులో నా పాత్రపై కచ్చితమైన అవగాహన ఉంది. చివరి 5-6 ఓవర్లలో బ్యాటింగ్ చేయాల్సి ఉండటమే నా పాత్ర. ఆ సమయంలో దూకుడుగా ఆడాలి. అందుకోసం కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించా. ఫినిషింగ్ నైపుణ్యాలపై దృష్టి పెట్టా. నెట్స్‌లోనూ ఇదే మైండ్ సెట్‌తో ప్రాక్టీస్ చేస్తా. టీమిండియా విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నా’ అని రింకు సింగ్ చెప్పాడు.