యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 19 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 29 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు తమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: CV Anand: త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం.. సీవీ ఆనంద్ వార్నింగ్!
ఆసియా కప్ 2025లో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతడి ఎడమ కాలి తొడ కండరానికి గాయం అయింది. ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ మైదానాన్ని వీడాడు. గాయంతో ఫైనల్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. హార్దిక్ కోలుకోవడానికి దాదాపు 4 వారాల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడట. టీ20ల సిరీస్‌లో మాత్రం హార్దిక్ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పునరాగమనం చేయనున్నారు. టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
