IND vs AUS Final Weather Forecast and Pitch Report: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. వాతావరణం సహకరిస్తుందా? లేదా? అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అయితే 17 నుంచి 19 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు చెప్పింది. దాంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్‌కు సోమవారం రిజర్వ్ డే ఉన్న విషయం తెలిసిందే.
నరేంద్ర మోడీ స్టేడియం సాధారణ బ్యాటింగ్ పిచ్. పూర్తిగా బ్యాటింగ్‌కు గానీ, బౌలింగ్‌కు కానీ ఏకపక్షంగా ఈ పిచ్ సహకరించదు. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు చేయొచ్చు. బౌలర్లూ ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఇదే పిచ్‌పై జరిగింది. ఆ మ్యాచులో 191 పరుగులకే పాకిస్థాన్‌ను చిత్తు చేసి 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ స్పిన్ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
Also Read: IND vs AUS Final 2023: నేడు వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మూడో టైటిల్‌పై భారత్ గురి!
ఫైనల్ ఆడే పిచ్ నెమ్మదిగా ఉంటుందని అంచనా. ఈ పరిస్థితిలో భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టనున్నారు. శుక్ర, శని వారాల్లో ఈ నల్లమట్టి పిచ్‌పై హెవీ రోలర్‌లను ఉపయోగించారు. దాంతో ఈ పిచ్ స్లోగా ఉంటుందనే దానికి స్పష్టమైన సూచన. ఈ పిచ్ స్లోగా ఉంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో తెలిపాడు. అయితే పాకిస్థాన్ మ్యాచుతో పోలిస్తే ప్రస్తుతం పిచ్‌పై పచ్చగడ్డి కనిపిస్తోందని రోహిత్ చెప్పాడు. దాంతో భారత స్పిన్నర్లు ఈ పిచ్‌పై మరోసారి మ్యాజిక్‌ను చూపిస్తారని అందరూ అబిప్రాయపడుతున్నారు.