Virat Kohli: ప్రపంచకప్ ట్రోఫీ రాకపోయినా.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనోడికే దక్కింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Wins Player of the Tournament: వన్డే ప్రపంచకప్ 2023 సందడి ముగిసింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. ఆరంభంలో తడబడిన ఆసీస్.. టోర్నీ చివరలో గొప్పగా ఆడి ఏకంగా కప్ ఎగరేసుకుపోయింది. ఆరంభం నుంచి గొప్పగా ఆడిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడింది. దాంతో మూడోసారి వన్డే ప్రపంచకప్ గెలవాలన్న భారత్ ఆశ గంగపాలైంది. నాకౌట్ పోరులో మరోసారి ఒత్తిడికి చిత్తైన టీమిండియా.. 140 కోట్ల భారతీయుల కలను చిదిమేసింది.
ఆస్ట్రేలియా విజయంలో సూపర్ సెంచరీతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (137 పరుగులు; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) హీరోగా నిలిచాడు. సెంచరీ చేసిన హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు కింగ్ విరాట్ కోహ్లీకి దక్కింది. మెగా టోర్నీలో ఆడిన 11 మ్యాచుల్లో విరాట్ 765 పరుగులు చేశాడు. ఇందులో 9 సార్లు 50 ప్లస్ చేయగా.. 3 సెంచరీలు బాదాడు. ఈ అవార్డు కోసం రోహిత్ శర్మ, మహ్మద్ షమీ పోటీ పడ్డారు. కానీ ఐసీసీ నియమించిన ప్యానెల్, అభిమానులు కోహ్లీకే ఓటేశారు.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
Also Read: IND vs AUS Final 2023: ఛేదనలో నా గుండె దడ పెరిగింది: ప్యాట్ కమిన్స్
వన్డే ప్రపంచకప్ 2023 దక్కకపోయినా.. కనీసం ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు అయినా వచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ మనదే అంటూ సోషల్ మీడియాలో కొందరు ఫాన్స్ ఆనందపడుతున్నారు. ప్రపంచకప్ 2023లో విరాట్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. కీలక సమయంలో జట్టుకు విలువైన పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనే సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..