David Warner withdraws from T20 Series vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా టీంలో సీఏ కీలక మార్పు చేసింది. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సీఏ విశ్రాంతిని ఇచ్చింది. ప్రపంచకప్ 2023లో 535 పరుగులతో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్‌గా నిలిచిన వార్నర్.. ఇదివరకు సీఏ ప్రకటించిన జట్టులో ఉన్నాడు. తాజాగా వార్నర్ స్థానంలో ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీని ఎంపిక చేశారు.
డేవిడ్ వార్నర్‌ను స్వదేశానికి పంపాలని సెలక్టర్లు నిర్ణయించారని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. సొంతగడ్డపై పాకిస్తాన్ టీంతో జరిగే టెస్టు సిరీసే తన టెస్టు కెరీర్‌లో చివరిదని గతంలో సూచనప్రాయంగా చెప్పిన వార్నర్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ 2023 గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే భారత్‌తో టీ20 సిరీస్‌లో ఆడనున్నారు. అబాట్, హెడ్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టాయినిస్, జంపాలు పొట్టి సిరీస్ ఆడనున్నారు. వేడ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
Also Read: Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు!
ఆస్ట్రేలియా జట్టు:
వేడ్ (కెప్టెన్), హార్డీ, బెరెన్‌డార్ఫ్, అబాట్, డేవిడ్, ఎలిస్, హెడ్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, సంఘా, షార్ట్, స్మిత్, స్టాయినిస్, రిచర్డ్‌సన్, జంపా.