India vs Australia World Cup 2023 Final Live Score Updates: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికాసేపట్లో ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. మూడోసారి వన్డే ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని టీమిండియా పట్టుదలతో ఉంటే.. ఆరో టైటిల్ ఖాతాలో వేసుకోవాలి ఆస్ట్రేలియా చూస్తోంది. టోర్నీలో ఆధిపత్యానికి తోడు.. సొంతగడ్డపై ఆడుతుండటం రోహిత్ సేనను ఫేవరెట్‌గా నిలబెడుతోంది.
-
వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 240 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అందరూ ప్లేయర్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరచడంతో.. 6 వికెట్ల తేడాతో గెలుపొందారు.
-
హాఫ్ సెంచరీ చేసిన లబుషేన్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో లబుషేన్ అర్ధసెంచరీ చేశాడు. 99 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ట్రేవిస్ హెడ్ (130), లబుషేన్(57) ఉన్నారు
-
సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రేవిస్ హెడ్..
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రేవిస్ హెడ్ సెంచరీ చేశాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
-
నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 144 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 4 పరుగులకే స్టీవెన్ స్మిత్ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసి స్టీవెన్ స్మిత్ అయ్యాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మార్ష్ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. షమీ వేసిన తొలి ఓవర్లోనే మొదటి వికెట్ తీశాడు.
-
240 పరుగులకు భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ స్కోర్ 240 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ (66) అత్యధిక పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) పరుగులు చేశారు. ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్ ఉడ్, కమిన్స్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. మ్యాక్స్ వెల్, జంపాకు చెరో వికెట్ తీశారు.
-
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సూర్యకుమార్ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 227/9 ఉంది.
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా..
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు.
-
ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. షమీ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ షమీ 6 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
-
ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. కేఎల్ రాహుల్ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 107 బంతుల్లో 66 పరుగులు చేసి కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. జడేజా ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసి రవీంద్ర జడేజా ఔట్ అయ్యాడు..
-
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. 86 బంతుల్లో 50 పరుగులు చేశాడు. క్రీజులో కేఎల్ రాహుల్(50), రవీంద్ర జడేజా (9) ఉన్నారు. 35 ఓవర్లలో భారత్ స్కోరు 175/4 పరుగులు ఉంది.
-
IND vs AUS: 30 ఓవర్లలో భారత్ స్కోరు 152/4..
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతుంది. 30 ఓవర్లలో భారత్ స్కోరు 152/4 పరుగులు ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (39), జడేజా (1) ఉన్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ ఔట్
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 54 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (37), రవీంద్ర జడేజా ఉన్నారు.
-
హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
వరల్డ్ కప్ ఫైనల్ 2023 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశారు. 57 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (51), కేఎల్ రాహుల్ (33) ఉన్నారు.
-
నిలకడగా ఆడుతున్న టీమిండియా బ్యాటర్లు
టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో క్రీజులో ఉన్న కోహ్లీ(41), కేఎల్ (21) రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. గత 10 ఓవర్ల నుంచి జట్టుకు ఒక బౌండరీ కూడా లేదు. ప్రస్తుతం 21 ఓవర్లలో 119/3 పరుగులు ఉంది.
-
4 పరుగులకు శ్రేయాస్ అయ్యర్ ఔట్
ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు
-
రోహిత్ శర్మ ఔట్:
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (23), శ్రేయాస్ అయ్యర్ (4) ఉన్నారు.
-
8 ఓవర్లలో భారత్ స్కోరు: 61/1
8 ఓవర్‌లకు భారత్ స్కోరు 61/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (36), శుభ్‌మన్ గిల్ (21) ఉన్నారు.
-
కోహ్లీ హ్యాట్రిక్ ఫోర్స్:
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ ఫోర్స్ బాదాడు. మిచెల్ స్టార్క్ వేసిన 7వ ఓవర్ మొదటి మూడు బంతులను విరాట్ బౌండరీలకు తరలించాడు.
-
6 ఓవర్లు పూర్తి:
భారత్ ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు పూర్తయ్యాయి. భారత్ స్కోర్ 40/1. క్రీజ్‌లో రోహిత్ శర్మ (32), శుభ్‌మన్ గిల్ (3) ఉన్నారు.
-
రోహిత్ సిక్స్:
ఐదవ ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (31), విరాట్ కోహ్లీ (1) ఉన్నారు. మిచెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదాడు. వికెట్ పడినా రోహిత్ దూకుడుగానే ఆడుతున్నాడు.
-
వికెట్:
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (4) క్యాచ్ ఔట్ అయ్యాడు.
-
ఐదు పరుగులు:
మిచెల్ స్టార్క్ మూడో ఓవర్‌లో ఐదు పరుగులు ఇచ్చాడు. క్రీజ్‌లో రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (3) ఉన్నారు. భారత్ స్కోర్ 18/0.
-
రోహిత్ హిట్టింగ్:
రెండో ఓవర్ పూర్తి. భారత్ స్కోర్ 13/0. క్రీజ్‌లో రోహిత్ శర్మ (13), శుభ్‌మన్ గిల్ (0) ఉన్నారు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ రెండు బౌండరీలు బాదాడు.
-
మొదటి ఓవర్ పూర్తి:
మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 3 రన్స్ చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (3), శుభ్‌మన్ గిల్ (0) ఉన్నారు.
-
భారత్ బ్యాటింగ్ ప్రారంభం:
భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. తొలి ఓవర్‌ను మిచెల్ స్టార్క్ వేస్తున్నాడు.
-
ఆల్‌ది బెస్ట్ భారత్: నరేంద్ర మోదీ
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో తలపడుతున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల మంది మద్దతుగా నిలుస్తున్నారు.. అద్భుతంగా ఆడి భారత్‌ను విశ్వ విజేతగా నిలపాలని ట్వీట్ చేశారు.
-
అప్పుడు భారత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా:
In 2003 - India won the toss & decided to bowl first in final vs Australia.
In 2023 - Australia won the toss & decided to bowl first in the final vs India. pic.twitter.com/U75OWNUbMm
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
-
నరేంద్ర మోదీ స్టేడియంలో ఎయిర్ షో:
The air show at Narendra Modi Stadium.
- This is beautiful. 🇮🇳 🏆pic.twitter.com/M1hgn0vBJn
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
-
ఊహాగానాలను తెర:
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. దాంతో ఆర్ అశ్విన్ ఆడుతాడన్న ఊహాగానాలను తెర పడింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు యాష్ బౌలింగ్‌లో పరుగులు చేయలేరని, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతడు బరిలోకి దిగుతాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
-
కల నిజమైంది: రోహిత్
'టాస్ గెలిస్తే నేను బ్యాటింగ్ ఎంచుకునే వాడిని. మంచి పిచ్, పెద్ద ఆట కాబట్టి స్కోర్ బోర్డుపై భారీ పరుగులు ఉంచాలి. మేము ఇక్కడ ఆడిన ప్రతిసారీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు, ఇది అద్భుతంగా ఉంటుంది. క్రికెట్ ఈవెంట్‌లో అతిపెద్ద మ్యాచ్ ఇది. ప్రశాంతంగా ఉండి పని చేసుకుపోవాలి. ఫైనల్‌లో భారత జట్టుకు సారథ్యం వహించడంతో కల నిజమైంది. మా ముందు ఏ లక్ష్యం ఉందో తెలుసు, బాగా ఆడి ఫలితం సాధించాలి. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మేము గత 10 గేమ్‌లలో నిలకడగా ఆడాం. మా జోరును ఫైనల్‌లో కొనసాగిస్తాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు' అని టాస్ సందర్భంగా రోహిత్ తెలిపాడు.
-
🚨 Toss & Team News from Narendra Modi Stadium, Ahmedabad 🚨
Australia have elected to bowl against #TeamIndia in the #CWC23 #Final.
A look at our Playing XI 👌
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#MenInBlue | #INDvAUS pic.twitter.com/433jmORyB3
— BCCI (@BCCI) November 19, 2023
-
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్ (కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.
-
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా:
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎందుకున్నాడు.
-
నరేంద్ర మోడీ స్టేడియంలో టాలీవుడ్ హీరోలు:
ప్రస్తుతం దేశమంతా క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా.. అందరూ టీమిండియాకు జై కొడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 మన సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ జాబితాలో టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. భారత్ ట్రోఫీ సాదిస్తుందని విక్టరీ వెంకటేశ్, లవర్ భాయ్ తరుణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ చూసేందుకు ఈ ఇద్దరు నరేంద్ర మోడీ స్టేడియంకు వెళ్లారు.
-
ఒక్కో మార్పు:
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ప్లేయింగ్ 11 మీదే ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. మొహ్మద్ సిరాజ్ స్థానంలో ఆర్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు అశ్విన్ బౌలింగ్‌లో రాణించడకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు ఆసీస్ కూడా మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్థానంలో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్‌ను ఆడించే ఛాన్స్ ఉంది.
-
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్ (కీపర్), మార్నస్ లబుషేన్/ మార్కస్ స్టోయినీస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.
-
స్టేడియం మొత్తం బ్లూ మయం:
It's a sea of blue at the #CWC23 Final 💙😍#INDvAUS pic.twitter.com/NaNXlV4dEZ
— ICC Cricket World Cup (@cricketworldcup) November 19, 2023
-
భారత్ ఆటగాళ్ల ఫొటోస్:
Let's GO #TeamIndia 🙌#CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/2MA1XgjqGe
— BCCI (@BCCI) November 19, 2023
-
పిచ్ రిపోర్ట్:
లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే ఫైనల్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నల్ల రేగిడితో చేసిన ఈ పిచ్.. బ్యాట్, బౌలింగ్‌కు సహకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బౌన్స్ తక్కువగా ఉండటంతో పాటు బంతి నెమ్మదిగా తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టే మూడుసార్లు గెలిచింది. తేమ ప్రభావం కూడా ఉండొచ్చు. నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 251.