Site icon NTV Telugu

IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. వన్డే సిరీస్ నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్!

Adam Zampa, Josh Inglis

Adam Zampa, Josh Inglis

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్ ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 19న పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి వన్డేకు స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. వీరి స్థానంలో మాథ్యూ కున్నెమాన్, జోష్ ఫిలిప్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టులోకి తీసింది.

ఆడమ్ జంపా సతీమణి న్యూ సౌత్ వేల్స్‌లో రెండవ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తన సతీమణి పక్కన ఉండేందుకు జంపా మొదటి వన్డేలో ఆడడం లేదు. అడిలైడ్, సిడ్నీలలో జరిగే రెండవ, మూడవ వన్డేలలో ఆడనున్నాడు. జోష్ ఇంగ్లిస్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడు కూడా పెర్త్‌ వన్డేకు దూరమయ్యాడు. ఇంగ్లిస్ స్థానంలో జోష్ ఫిలిప్‌ మొదటి వన్డే ఆడనున్నాడు. జాంపా స్థానంలో మాథ్యూ కున్నెమాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: HCA: హెచ్‌సీఏలో మరో వివాదం.. రాచకొండ సీపీకి ఫిర్యాదు!

ఆస్ట్రేలియా వన్డే జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

వన్డే షెడ్యూల్:
అక్టోబర్ 19: మొదటి వన్డే, పెర్త్ స్టేడియం
అక్టోబర్ 23: 2వ వన్డే, అడిలైడ్ ఓవల్
అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీ

 

Exit mobile version