Site icon NTV Telugu

IND vs AUS: ప్లేయింగ్ XIలో భారీ మార్పులు.. మొదట బ్యాటింగ్ ఎవరిదంటే.?

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించనుంది. సిరీస్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత 1-1 సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ పోరులో గెలిచే జట్టు సిరీస్‌ను కోల్పోకుండా ఉండే అవకాశం లభిస్తుంది. అంటే కనీసం 2-2తో సిరీస్ సమంగా ముగిసే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన జట్టు మాత్రం సిరీస్ గెలిచే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యో.. రూ.44,000కుపైగా తగ్గింపుతో Samsung Galaxy Z Flip 6 అందుబాటులో..!

ఇక నేటి మ్యాచ్ లో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. మునుపటి మ్యాచ్‌లో ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఫామ్‌లో లేని శుభమన్ గిల్‌పై మరోసారి అందరి దృష్టి నిలిచింది. ఇక ఆస్ట్రేలియా జట్టులో మాత్రం నాలుగు ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టులోకి ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్ తిరిగి వచ్చారు. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇలా ఉన్నాయి.

టీమ్ ఇండియా ప్లేయింగ్ XI: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.

Suicide: విషాదం.. చీమలకు భయపడి.. వివాహిత ఆత్మహత్య..

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్టి ఉన్నారు.

Exit mobile version