NTV Telugu Site icon

IND vs AUS: నేటి నుంచే భారత్, ఆస్ట్రేలియా ‘పింక్’ టెస్టు.. ఓపెనర్‌గా రాహుల్! టాస్‌ కీలకం

Kl Rahul Opener

Kl Rahul Opener

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టెస్ట్ ఆరంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే/నైట్‌ టెస్టులో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. అదే ఊపులో రెండో టెస్టులో గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా.. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్.. టీమిండియాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.

వ్యక్తిగత కారణాలతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి జట్టుతో చేరడం భారత్‌ బ్యాటింగ్‌ మరింత బలోపేతమైంది. తొలి టెస్టులో చెలరేగిన యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫామ్‌ కలిసొచ్చే అంశం. పెర్త్‌లో ఓపెనర్‌గా రాణించిన కేఎల్ రాహుల్.. రెండో టెస్టులో కూడా ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. రోహిత్ మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నాడు. సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో ఫామ్‌ను అందుకోవడం జట్టుకు శుభసూచకం. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి పర్వాలేదనిపించాడు. రోహిత్, గిల్‌లు అందుబాటులోకి రావడంతో ధృవ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌లు పెవిలియన్‌కే పరిమితం అవుతారు. బౌలింగ్‌ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సుందర్‌, బుమ్రా, సిరాజ్, హర్షిత్‌ కొనగనున్నారు.

తొలి టెస్టులో ఓడిన ఆసీస్ పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా అత్యంత బలమైన ప్రత్యర్థి. భారత బ్యాటర్లకు భిన్నమైన సవాలు తప్పదు. గులాబి బంతి నుంచి వచ్చే అదనపు సీమ్‌ను ఆసీస్ పేసర్లు ఉపయోగించుకోనున్నారు. స్వదేశంలో ఇప్పటివరకు జరిగిన 12 డే/నైట్‌ టెస్టు జరగగా.. కంగారూ జట్టు ఒకే ఒక్క ఓటమి చవిచూసింది. కమిన్స్, స్టార్క్, బోలాండ్‌లు పేస్‌ ఎటాక్‌తో చెలరేగనున్నారు. బ్యాటర్ల ఫామ్‌ ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తోంది. స్మిత్, లబుషేన్‌ పేలవ ఫామ్ కనబర్చుతున్నారు. ఈ మ్యాచ్‌లో వాళ్లు ఫామ్‌ అందుకుంటారని జట్టు ఆశిస్తోంది. కుర్రాడు మెక్‌స్వీనీ ఎలా ఆడుతాడో చూడాలి. హెడ్, మిచెల్‌ మార్ష్, అలెక్స్‌ కేరీ మొదటి టెస్టులో రన్స్ చేశారు.

అడిలైడ్‌ పిచ్‌ బౌలర్లతో పాటు బ్యాటర్లకూ సహకారం లభిస్తుందని క్యురేటర్‌ చెప్పాడు. అయితే సాధాణంగా పేస్‌ బౌలర్లకు ఈ పిచ్ సహకరిస్తుంది. పిచ్‌ మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. అడిలైడ్‌లో ఛేదన కష్టం కాబట్టి.. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశముంది. చిరు జల్లుల వల్ల తొలి రెండు రోజులు ఆటకు అంతరాయం కలగొచ్చు. మ్యాచ్ ఉదయం 9.30కి ఆరంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.

తుది జట్లు (అంచనా):
భారత్‌: యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, గిల్, కోహ్లి, రోహిత్, పంత్, వాషింగ్టన్‌ సుందర్, నితీశ్‌ కుమార్‌రెడ్డి, హర్షిత్‌ రాణా, బుమ్రా, సిరాజ్‌.
ఆస్ట్రేలియా: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మిచెల్‌ మార్ష్, అలెక్స్‌ కేరీ, కమిన్స్, స్టార్క్, లైయన్, బోలాండ్‌.

పింక్‌ బాల్‌ టెస్ట్ సెషన్ టైమింగ్స్ ఇవే:
1వ సెషన్: ఉదయం 9.30 నుండి 11.30 వరకు
2వ సెషన్: మధ్యాహ్నం 12.10 నుంచి 2.10 వరకు
3వ సెషన్: మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు

Show comments