IND vs AUS: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరిగ్గా వాడుకున్నారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత టాప్ ఆర్డర్ తడబాటు చూపించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5) తొందరగా ఔటయ్యాడు. మరోవైపు, పవర్‌ప్లేలో చెలరేగిన అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. కేవలం 37 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్స్‌లు 68 పరుగులు చేసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు.
IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్..!
సంజు శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0) వంటి కీలక బ్యాటర్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (7), శివమ్ దూబే (4), కుల్దీప్ యాదవ్ (0) కూడా జట్టుకు పెద్దగా సహకరించలేకపోయారు. అయితే లోయర్ ఆర్డర్‌లో హర్షిత్ రాణా కొంత పోరాడి 33 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. దీనితో చివరికి భారత్ 125 పరుగుల వద్దనే కుప్పకూలింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని చెప్పవచ్చు. జోష్ హేజిల్‌వుడ్ కేవలం 13 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే నాథన్ ఎలిస్ 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. జేవియర్ బార్ట్‌లెట్ కూడా 2 వికెట్లు తీయగా, మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ సాధించాడు. చూడాలి మరి భారత బౌలర్లు ఆస్ట్రేలియాను ఎంతవరకు కట్టడి చేయగలరో.
RRB JE Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 2569 జూనియర్ ఇంజనీర్ పోస్టులు..
