NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. మరోసారి మూడు మార్పులతో భారత్!

India Test Team

India Test Team

భారత గడ్డపై న్యూజిలాండ్‌ మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై ఎదురులేకుండా పోతున్న టీమిండియాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు చేతులేయడంతోనే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబైలో మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రోహిత్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానాల్లో గిల్, సుందర్, ఆకాశ్‌కు అవకాశం దక్కింది. మార్పులు చేసినా టీమిండియా ఓడిపోయింది. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అలానే ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. తొలి టెస్టులో గాయపడిన రిషబ్ పంత్.. రెండో మ్యాచ్‌లో ఆడాడు. అయితే అతడిపై మరీ ఎక్కువ భారం మోపకుండా.. చివరి మ్యాచ్‌కు ధ్రువ్ జురెల్‌ను ఆడించే అవకాశం ఇవ్వనుందని సమాచారం.

Also Read: YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆదాయమే ఆదాయం! వారికి మాత్రం నో ఛాన్స్

మొదటి రెండు టెస్టుల్లో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లు ఆడాడు. చివరి టెస్టులో అక్షర్‌ పటేల్‌ను బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. జడేజాకు విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో అక్షర్‌ను ఆడించనున్నారట. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించని మహ్మద్ సిరాజ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చి.. సిరాజ్‌ను తీసుకుంటారని సమాచారం.