NTV Telugu Site icon

Vijayawada: విజయవాడలో భారీగా డయేరియా కేసులు.. రేపు నీటి టెస్టుల రిపోర్ట్..!

Vijayawada

Vijayawada

Contaminated Drinking Water Problem: విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు. బాధితుల్లో నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. కలుషిత నీరు పైప్‌లైన్లలో కలుస్తున్నా.. వీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని మండిపడుతున్నారు.

Read Also: Kalki 2898 AD: ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌.. భారీ మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ పంపిణీ హక్కులు!

కాగా, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శుద్ధిపై కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంకులు పాకురు పట్టి ఉన్నాయని చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కేవలం ఏడు అడుగుల లోతులోనే నీరు ఉండటంతో ఇంటేక్‌ వెల్‌లోకి మొత్తం బురద నీరు వెళ్తుంది.. ఈ నీటిని పలు దశల్లో క్లీన్ చేయాల్సింది పోయి.. అరకొర వాటర్ ట్రీట్‌మెంట్‌తో నేరుగా పంపింగ్‌ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. కుళాయి నీరు తాగేందుకు అవకాశం లేకపోవడంతో అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ క్యాన్లను కొంటున్నారు. ఇక, ఇతర అవసరాలకు కలుషిత నీటినే వినియోగించడంతో చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయని విజయవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: PM Modi : కన్యాకుమారిలోని వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోడీ ధ్యానం..ఫోటో రిలీజ్

ఇక, విజయవాడ నగరంలో కలుషితనీటి బాధితుల సంఖ్య పెరుగుతుంది. డయేరియా బారిన ప్రజలు పడుతున్నారు. సంవత్సరం లోపు వయసున్న పిల్లలు సైతం డయేరియా బాధితులలో ఉన్నారు. కాగా, ఆలస్యంగా మేల్గొన్న అధికారులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్తనమూనాలను సేకరిస్తున్నారు. వాటి ఫలితాలను ఇప్పటి వరకు వైద్యారోగ్య శాఖ వెల్లడించలేదు. ఇక, నీటి నమూనాల పరీక్షలు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇందులో నైట్రేట్ లు అధికంగా ఉండటమే కారణం కావచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రేపు ఉదయానికి నీటి టెస్టుల రిపోర్టులు వస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు.