Congress: బ్యాంకు ఖాతాలపై చర్యల నిలిపివేతకు కోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు (Congress) భారీ షాక్ తగలింది. తమ బ్యాంకు ఖాతాలపై ఐటీ శాఖ చర్యల నిలిపివేతకు న్యాయస్థానం నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను అప్పిలేట్ ట్రైబ్యునల్ తిరస్కరించింది.
తమ బ్యాంకు ఖాతాల (Bank Accounts)పై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆదాయపు పన్ను (Income Tax) అప్పిలేట్ ట్రైబ్యునల్ కొట్టివేసింది. అయితే హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పుపై 10 రోజుల పాటు స్టే విధించాలని హస్తం పార్టీ అభ్యర్థించింది. దీన్ని కూడా ట్రైబ్యునల్ తిరస్కరించింది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వీటికి పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. ఇటీవల రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం కాంగ్రెస్‌కు చెందిన పలు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. దీనిపై పార్టీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో స్వల్ప ఊరట లభించింది.
దీనిపై తదుపరి విచారణ చేపట్టేంతవరకు బ్యాంకు ఖాతాలను యథావిధిగా నిర్వహించుకునేందుకు ట్రైబ్యునల్ అనుమతినిచ్చింది. దీంతో ఆ అకౌంట్లను పునరుద్ధరించారు. అయితే ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఐటీ అధికారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65కోట్లు విత్‌డ్రా చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం కాంగ్రెస్ అభ్యర్థనను కొట్టివేసింది. దీనిపై కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మాకెన్ స్పందించారు. ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయపరమైన చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!