NTV Telugu Site icon

Gold Seize: బీఎండబ్ల్యూ కారులో మ్యాట్ కింద 12 కేజీల బంగారం.. విలువ రూ.7కోట్లు

Bmw

Bmw

Gold Seize: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత రెండు మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు నిర్వహిస్తోంది. ఓ నగల వ్యాపారి ఇంట్లో సోదాలు జరిగాయి. సోదాల్లో బయటపడినది చూసి ఆదాయపన్ను శాఖ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సదరు వ్యక్తి కారులో సోదా చేయగా చాపకింద నుంచి బంగారం బయటపడింది. ఈ బంగారం కాస్త కూస్తో కాదు 12 కిలోలు. ఇంత బంగారం ఖరీదు రూ.7 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ కేసు కాన్పూర్‌కు చెందిన ఆభరణాల వ్యాపారి రాధామోహన్ పురుషోత్తమ్‌కు సంబంధించినది. ఇవే కాకుండా రితి హౌసింగ్ లిమిటెడ్, ఇతర వ్యాపారవేత్తలకు చెందిన 17 ప్రదేశాలలో గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఆదాయపు పన్ను శాఖకు అనుమానం వచ్చింది. దీని తర్వాత ఆభరణాల వ్యాపారి బీఎండబ్ల్యూ కారును సోదా చేశారు.

Read Also:Kedarnath Yatra: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన కేదరనాథ్ యాత్ర

సీటు, డ్యాష్‌బోర్డ్‌ని వెతికిన వెంటనే టీమ్ కారులోంచి మ్యాట్‌ని తీసేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మ్యాట్ కింద భారీ మొత్తంలో బంగారాన్ని దాచారు. ఈ బంగారాన్ని బయటకు తీసి తూకం చేయగా సుమారు 12 కిలోలు ఉన్నట్లు తేలింది. ఈ బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసి సంబంధిత చర్యలు తీసుకుంటోంది. అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందంటూ సదరు వ్యాపారిని ప్రశ్నిస్తున్నారు. కాన్పూర్‌లోని చాలా మంది వ్యాపారవేత్తలు, నగల వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. వారి ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తున్నారు.