NTV Telugu Site icon

Minister Mallareddy IT Raids : మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2కోట్లు సీజ్‌.. కొనసాగుతున్న సోదాలు

Money Bundles

Money Bundles

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లడు రాజశేఖర్‌రెడ్డి కొడుకు మహేందర్‌ రెడ్డి, భద్రారెడ్డి ఇళ్లలోనూ ఐటీ శాఖ అధికారులు తనీఖీలు చేస్తు్న్నారు. అలాగే మల్లారెడ్డి సొదరుగు గోపాల్‌ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వీటితో పాటు 14 విద్యాసంస్థల కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో.. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఈ ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో మరో 2 కోట్లు స్వాధీనం చేసినట్లు తెలుస్తోంది.

మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి సెల్ ఫోన్ ఆయన నివాసం పక్కన ఉన్న క్వార్టర్స్ వద్ద ఓ గోనెసంచిలో దాచి ఉంచడాన్ని గుర్తించారు ఐటీ అధికారులు. ఇదిలా ఉంటే.. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్‌లను సైతం సీజ్‌ చేసి సోదాలు చేస్తున్నారు. అయితే.. మల్లారెడ్డి సోదరుడు ఇంట్లో లాకర్‌ను గుర్తించిన ఐటీ అధికారులు దాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బాలనగర్‌లోని రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.