Officer Arrested For trying to kiss a maid in Tamilnadu: ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో పనిచేసే ఓ పనిమనిషిని బలవంతంగా ముద్దుపెట్టాడు ఓ ఉన్నతాధికారి. గదిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషిని కౌగిలించుకుని ముద్దు పెట్టాడని ఆ పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి అధికారి గాబ్రియేల్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని నుంగబాక్కంలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని నుంగంబాక్కంలో గల ఆదాయపు పన్నుల శాఖ కార్యాలయంలో 36 ఏళ్ల గాబ్రియేల్ ఫ్రాంక్టన్ సీనియర్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే కార్యాలయంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ ఐదేళ్లుగా పనిమనిషిగా పని చేస్తోంది. ఆమె ఎప్పటిలాగే డిసెంబర్ 14న సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ గాబ్రియేల్ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతంగా ముద్దు పెట్టాడు. అతడు ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో ఎవరికి చెప్పినా వినకపోవడంతో స్థానిక నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాబ్రియేల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన నుంగంబాక్కం అన్నానగర్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో చోటుచేసుకుంది.
ఆమె ఫిర్యాదు ప్రకారం.. 14న రోక్స్ గదిని శుభ్రం చేయడానికి పిలిచాడు. ఇల్లు శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ మహిళ తెలిపింది. గాబ్రియేల్ తన మొబైల్ ఫోన్‌లో నిరంతరం బెదిరించేవాడని కూడా ఆమె చెప్పింది. అతడి వేధింపులు భరించలేక 15 తేదీన ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ గాబ్రియేల్‌ను అరెస్ట్ చేశారు.
