NTV Telugu Site icon

Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు

Income Tax

Income Tax

Income Tax : ఇన్ కమ్ టాక్స్ చెల్లించే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతానికి మీరు టాక్స్ కడుతున్నప్పటికీ దానినంతా ఆదా చేసుకునే మార్గం ఉంది. మీ వార్షిక వేతనం రూ. 10.5 లక్షలు అయితే, ఈ జీతంపై 100శాతం పన్నును ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రూ. 2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అయితే మీ ఆదాయం రూ. 10.5 లక్షల వరకు ఉన్నప్పటికీ.. మీరు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000
ఏదైనా వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 10 లక్షల 50 వేలు అయితే.. మీరు నేరుగా రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్(ప్రామాణిక తగ్గింపు) పొందుతారు. ఈ సందర్భంలో మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.10 లక్షలు. మీడియా కథనాల ప్రకారం, ఈ సారి ప్రభుత్వం తీసుకురానున్న బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుండి రూ.70,000కి పెంచే అవకాశాలున్నాయి.

 

Read Also:Bonza Airline: ‘బొంజా’ బొనాంజా.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణం

80Cలో 1.5 లక్షల తగ్గింపు
ఇది కాకుండా మీరు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఇది LIC, PPFతో సహా అనేక సౌకర్యాలతో వస్తుంది. దీని ప్రకారం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 8,50,000 మాత్రమే.

ఇక్కడ కూడా 50 వేల తగ్గింపు లభిస్తుంది
మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD ప్రకారం NPS ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో మీకు రూ.50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే ఇప్పుడు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8 లక్షలు మాత్రమే.

మరో రూ.2 లక్షల తగ్గింపు
మీరు ఇంటిని కొనుగోలు చేసి ఉంటే లేదా మీ పేరు మీద గృహ రుణం(Home Loan) ఉంటే, మీరు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందుతారు. ఆదాయపు పన్ను చట్టం 24B కింద మీకు రూ.2 లక్షల వరకు పూర్తి మినహాయింపు లభిస్తుంది. కాబట్టి దీని ప్రకారం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.6 లక్షలు మాత్రమే.

Read Also: Elon Musk: నష్టాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన ఎలాన్ మస్క్

బీమా తీసుకోవడం ద్వారా రూ.75,000 తగ్గింపు పొందవచ్చు
అంతేకాకుండా, మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80డి కింద రూ. 75,000 క్లెయిమ్ చేయవచ్చు. మీరు మీ కుటుంబానికి బీమా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల 25 వేలు మాత్రమే తగ్గుతుంది.

రూ.25,000 ఎక్కువ తగ్గింపు పొందండి
మీరు ఏదైనా సంస్థకు చెందినవారైతే, విరాళం ద్వారా రూ. 25,000 వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఇందులో మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మినహాయింపును పొందిన తర్వాత, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షలు మాత్రమే ఉంటుంది, దానిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. చివరకు 10.5లక్షల వేతనం ఉన్న వ్యక్తి పై విషయాలను గనుక గమనించి పాటిస్తే మీ వేతనంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.