NTV Telugu Site icon

Bus Fall In Valley: బ్రేకులు ఫెయిలై లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి

Bus Accident

Bus Accident

Bus Fall In Valley: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఘోర ప్రమాద వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ శనివారం వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. కాగా, మరో 6 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ లోని బునెర్ జిల్లాలో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం బ్యాలెన్స్ కాకపోవడంతో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Read Also: IND vs NZ: విజయం ముందర బొక్కబోర్లా పడిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేసిన కివీస్

మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, కొందరు గుర్తు తెలియని ముష్కరులు భద్రతా బలగాలకు చెందిన రెండు వేర్వేరు కాన్వాయ్‌లపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి సహా 16 మంది సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరోవైపు, దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని సర్వేకై ప్రాంతంలో సైనికుల కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేశారని పాక్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. కాన్వాయ్ కరక్ జిల్లా నుండి కాబూల్ ఖేల్‌లోని న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ప్రదేశానికి వెళుతుండగా లక్కీ మార్వాట్ జిల్లాలోని దర్రా తుంగ్ చెక్ పోస్ట్ సమీపంలో మరో దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 5 మంది సైనికులు గాయపడ్డారు. ఈ విధంగా రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 16 మంది సైనికులు గాయపడ్డారు.