NTV Telugu Site icon

Sub Registrars Corruption: ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల చేతివాటం

Corruption

Corruption

అక్కడ ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారా? డాక్యుమెంట్ కదలాలంటే కాసులు ముట్టజెప్పాల్సిందేనా? కొర్రీలు పెట్టి మరీ డబ్బులు దండుకున్నది ఎవరు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్‌ఛార్జ్ ల పాలన ఇంకెన్నాళ్ళు. డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? వివిధ పార్టీల నాయకులు వారికే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల తీరు విమర్శల పాలవుతోంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇంచార్జ్ ల చేతుల్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్ ,మంచిర్యాల ,లక్షెట్టిపేట,నిర్మల్ ,ఆదిలాబాద్ ,బోథ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. ఒక రెండు చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నప్పటికి వారు లీవ్ లో వెళ్ళిపోవడంతో అక్కడ ఇన్‌ఛార్జ్ ల పాలన కొనసాగడం అక్రమాలకు తావిస్తోంది. అర్హతలేని, సీనియార్టీ లేని వారికి సైతం బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేక ఇద్దరు ఇన్‌ఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు.అయితే వీరు అక్రమాలు చేస్తున్నారని డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతున్న వారంతా ఏకంగా నిరసనలకు దిగుతున్నారు. వాళ్ళు చేపట్టిన నిరసన దీక్షలకు ప్రతిపక్ష నాయకులు మద్దతు పలుకుతున్నారు.

రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ ను నియమించాలని ఏకంగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయం వద్ద సైతం ధర్నా చేపట్టారు..అలాగే స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న వారు అక్రమాలు చేస్తున్నారని వీరంతా ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ఇలా ఉంటే డాక్యుమెంట్ రైటర్ల విధానం లేదు..రియల్ వ్యాపారులకు ,సబ్ రిజిస్టార్లకు మధ్య బ్రోకర్లుగా ఉండే వీరంతా ఇప్పుడు వ్యవస్థనే శాసించే స్థాయికి వెళ్ళారు. అందుకే వారికే అందరు మద్దతు తెలుపుతున్నారని వారి ఆందోళనలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు ఏం సంబంధం అంటున్నారు అధికారులు. అసలు వాళ్లకేం అర్హత ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులంటున్నారు. వాళ్లు ధర్నాలు చేస్తే సంబంధం లేదంటున్నారు.

ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న వారంతా ధర్నాల పేరు చెప్పి ఇళ్ళల్లో డాక్యుమెంట్లు కొట్టి ఇస్తూ కొంతమంది వేలాది రూపాయలు అదనంగా దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల అర్హత ఉన్న వాళ్లుగాని అసలు ఆవ్యవస్థే తొలగించబడిందని క్రయవిక్రయ దారులు ఎవ్వరి వద్దకు వెళ్ళకుండా నేరుగా వస్తే తామే రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. రైటర్ల వ్యవస్థ లేనప్పుడు రాజకీయ నాయకులు సైతం వారికెలా మద్దతు పలుకుతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్న మౌతున్నాయి. ఏది ఏమైనా బ్రోకర్ వ్యవస్థ లేకుండా ,క్రయవిక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

Wedding: జొమాటో నిర్లక్ష్యం.. మటన్ బిర్యానీ లేదని పెళ్లి వాయిదా..!!

Show comments