NTV Telugu Site icon

WT20 Worldcup 2024: ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి.. అయినా సెమీ ఫైనల్‌ రేసులో

India Vs Aus Women

India Vs Aus Women

WT20 Worldcup 2024: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 18వ మ్యాచ్‌లో అంటే ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ డూ-ఆర్-డై మ్యాచ్‌లో, చివరి మూడుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆపై భారత్‌ ను 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితం చేసింది. ఇక ఈ ఓటమి తర్వాత భారత్ సెమీఫైనల్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్ దశలో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 15వ విజయం.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం.? వ్యక్తి అరెస్ట్

అయితే, ఓటమి తర్వాత టీమ్ ఇండియా రన్ రేట్ న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉన్నందున భారత్‌కు సెమీ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ జట్టు సోమవారం న్యూజిలాండ్‌ను ఓడిస్తే, భారత్ సెమీ-ఫైనల్ స్థానాన్ని ఖాయం చేయాలని భారత్ ఇప్పుడు ప్రార్థిస్తుంది. అయితే న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటి దారి పడుతుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఈ నేపథ్యంలో 47 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఇందులో షెఫాలీ వర్మ (20), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (16)ల వికెట్లు లు ఉన్నారు. అయితే, దీని తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్), దీప్తి శర్మ (29) నాలుగో వికెట్‌కు 55 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం ద్వారా భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించారు. అయితే దీప్తి ఔట్ కావడంతో జట్టు స్కోరు 110 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆపై హర్మన్‌ప్రీత్ పోరాడిన చివరకు ఓటమి తప్పించలేకపోయింది.

Iran Iraq War: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి.. నలుగురు సైనికులు మృతి, 60 మందికి పైగా గాయాలు