NTV Telugu Site icon

Womens T20 Asia Cup : మరోమారు దాయాది దేశాల క్రికెట్ పోరు..

Ind Vs Pak

Ind Vs Pak

Womens T20 Asia Cup : తాజాగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ టి20 ఏషియా కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ మెగా ఈవెంట్ జూలై 19న మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ జూలై 19న శ్రీలంకలోని డంబుల్లా స్టేడియంలో యూఏఈ – నేపాల్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇక అదే రోజు సాయంత్రం చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఇండియన్ ఉమెన్స్ టీం మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్తో తలబడదునుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.

Oscar Academy : జక్కన్న దంపతులకి అరుదైన గౌరవం..

ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ బి లో టీమిండియా తో పాటు పాకిస్తాన్, నేపాల్, యూఏఈ లు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. గ్రూప్ దశలలో టాప్ గా నిలిచిన రెండు టీమ్స్ సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఇక సెమి ఫైనల్ లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 28న జరగబోయే ఫైనల్ లో తలబడతాయి. కేవలం పది రోజుల్లో ఈ టోర్నీ మొత్తం ముగుస్తుంది. 2022లో జరిగిన ఉమెన్స్ ఏషియా కప్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా ఓడించి ఏడవ సారి టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు ఉమెన్స్ క్రికెట్లో అత్యధిక ఏసియా కప్ టైటిల్స్ టీమిండియా పేరు మీదే ఉంది.

Nokia 3210: భారత మార్కెట్‌లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్‌ ఫీచర్స్ కూడా!

ఇక 2024 టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ అక్టోబర్ నెలలో జరగనుంది. దీంతో అన్ని జట్లకు ఈ ఏషియా కప్ మంచి ప్రాక్టీస్ కాబోతోంది. 2024 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. ఆ ఏషియా కప్ కు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. జులై 19 రాత్రి 7 గంటలకు టీమిండియా, పాకిస్తాన్ జట్లు ఉమెన్స్ ఆసియా కప్ 2024లో తలబడబోతున్నాయి. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియాకు జూలై 21 మధ్యాహ్నం రెండు గంటలకు యూఏఈ తో మ్యాచ్ జరగనుంది. జులై 23న మూడో మ్యాచ్లో నేపాల్ తో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలు కాబోతుంది.