Site icon NTV Telugu

Cheated Wife : ఫ్రెండ్ అని నమ్మితే పెళ్లానికే బీటేశాడు.. ఆ తరువాత వారిద్దరూ కలిసి..

Tamilnadu Affair Crime

Tamilnadu Affair Crime

Cheated Wife : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం ఒక ముఖ్యమైన బంధం. మన జీవితంలోని కష్టసుఖాలన్నీ ఫ్రెండ్ తోనే పంచుకుంటాం. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం ఓ వ్యక్తి ప్రాణంగా నమ్మిన స్నేహితుడిని దారుణంగా మోసం చేసి హతమార్చాడు. స్నేహితుడి భార్యతో అనైతిక సంబంధం పెట్టుకుని కాలికి ముల్లులా తయారయ్యాడు. ఈ ఉదంతం హరిద్వార్‌లో వెలుగు చూసింది. స్నేహితుడిని హత్య చేసి.. మృతదేహాన్ని కాలువలో పడేసి నిందితుడు పరారీ అయ్యాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తిని గుర్తించలేకపోవడంతో దహనం చేశారు. అయితే ఎట్టకేలకు కేసు బట్టబయలైంది. మృతుడి భార్య, స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: MLA Shanampudi Saidireddy : ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి

మృతుడి పేరు హేమేంద్ర, వృత్తి రీత్యా ట్రక్కు డ్రైవర్. నిందితుడు మహ్మద్ షరూఫ్ కూడా ట్రక్ డ్రైవర్. ఇద్దరూ ఒకే దగ్గర పని చేస్తుండడంతో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారి మహమ్మద్.. హేమేంద్ర ఇంటికి రాకపోకలు మొదలుపెట్టాడు. ఈలోగా హేమేంద్ర భార్యతో మహ్మద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాదాపు ఆరేళ్లుగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగించారు. కానీ హేమేంద్రకు ఈ సమాచారం తెలిసింది. వారిపై ఆగ్రహించాడు. దీంతో మహ్మద్, హేమేంద్ర భార్య అతన్ని ఎలాగైనా మట్టుపెట్టాలని కుట్రపన్నారు.

Read Also:MLC Kavitha : కేసీఆర్‌ను ఎదుర్కునే ధైర్యం లేక.. ఫేక్‌చాట్‌లతో నా మీద దుష్ప్రచారం

మార్చి 11న డిన్నర్‌కు వెళ్తున్నానని చెప్పి మహమ్మద్.. హేమేంద్రను భగవాన్‌పూర్‌కు పిలిచాడు. అప్పుడు అతడికి పెద్దమొత్తంలో వైన్ తాపించాడు. మద్యం మత్తులోకి చేరుకోగానే అతన్ని చంపారు. హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. 10 రోజుల తర్వాత.. హేమేంద్ర తప్పిపోయినట్లు అతని భార్య అతని అత్తమామలకు సమాచారం ఇచ్చింది. హేమేంద్ర తండ్రి మొహర్‌పాల్ పోలీసులను ఆశ్రయించి తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. గల్లంతైన హేమేంద్ర కోసం వెతుకుతున్న పోలీసులు అతడి భార్యపై అనుమానం వ్యక్తం చేశారు. భార్య మొబైల్ ఫోన్ సీడీఆర్ రిపోర్టును పోలీసులు అడిగారు. భార్య రోజూ ఒకరితో మాట్లాడుతున్నట్లు తేలింది. పోలీసులు భార్య, మహ్మద్‌లను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించగా అంతా బయటపెట్టారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Exit mobile version