Shocking Incident: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ ఘోర సంఘటన జరిగింది. యూపీలో తీర్థయాత్రకు వచ్చిన ఓ వృద్ధుడు ఆదమరిచి నిద్రపోతున్న ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ వ్యక్తి చిన్నారిని పదేపదే నేలపై కొట్టినట్లు కనిపించింది. సన్యాసి వేషంలో దాడి చేసిన వ్యక్తి 52 ఏళ్ల వయస్సు గల ఓంప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు.
Read Also: Pakistan: పాక్‌లో మరణ మృదంగం.. వేర్వేరు ఘటనల్లో 29 మంది మృతి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తీర్ధ యాత్రికుడు ఓంప్రకాష్(52) అనేక మార్లు ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టాడని.. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి తమకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఆ వ్యక్తిని చితకొట్టడంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడని అతడిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడు స్పృహలోకి వస్తే తప్ప బాలుడిని ఎందుకు చంపాడన్న కారణాలు తెలియవని అన్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సప్తకోసి యాత్ర చేస్తూ అక్కడి వచ్చాడని, కానీ ఆ పిల్లాడిని ఎందుకు కొట్టి చంపాడో మాత్రం తెలియదన్నారు. ఆ బాలుడి తండ్రి ఆ ప్రాంతంలో జనరల్ స్టోర్‌ను నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు.