NTV Telugu Site icon

Karthika Masam 2023: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనాలు చేస్తే మంచిదట..!

Usiri Tree

Usiri Tree

హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన నిష్టలు పాటిస్తూ.. దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా భావించి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకిందనే భోజనాలు చేయాలనే సంప్రదాయం ఎందుకొచ్చిందో తెలుసుకుందాం…

NZ vs SL: లంక ఖాతాలో మరో ఓటమి.. కివీస్ ఘన విజయం

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం చెబుతుంది. అంతేకాకుండా.. ఉసిరి చెట్టును భూమాతగా కూడా కొలుస్తారు. అయితే దేవుళ్ల కాలంలో దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా.. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అని ఆచారాలు చెబుతాయి.

World Cup 2023: సచిన్ రికార్డు బ్రేక్.. రచిన్ అరుదైన ఘనత

అయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన, దాని నీడలో భోజనాలు చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట. అంతేకాకుండా.. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి.. చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరవాత చెట్టునీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తీకమాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. అలా చేయడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి కూడా ఆ ఇంటికి తగలదని చెబుతుంటారు.

Show comments