Site icon NTV Telugu

Top Universities In World: ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో భారత ఐఐటీలు..

Iit

Iit

ప్రపంచంలోని టాప్ 150 విశ్వవిద్యాలయాలలో IIT బాంబే, IIT ఢిల్లీ ఉన్నాయి. వరుసగా 13 సంవత్సరాలుగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో లండన్‌ కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరుతో ఓ నివేదికను ప్రచురించింది. ఐఐటీ ముంబై గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 31 స్థానాలు ఎగబాకి 118వ ర్యాంక్‌ కు చేరుకుంది.

2024 T20 World Cup Live: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఫ్రీగా చూసేయండి ఇలా..

అలాగే ఐఐటీ ఢిల్లీ 47 స్థానాలు మెరుగుపరుచుకుని 150వ స్థానంలో నిలిచింది. క్యాంపస్ ప్లేసెమెంట్స్ పరంగా., ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచంలో 44వ స్థానంలో ఉంది. యూనివర్శిటీల్లో విదేశీ ప్రొఫెసర్లు, విద్యార్థుల సంఖ్యలో భారత్ వెనుకబడి ఉందని తేలింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పరంగా ప్రపంచ సగటు 23.8% గా ఉండగా, భారత్‌లో 10 పాయింట్లు తక్కువగా ఉందని QS నివేదికను వెల్లడించింది.

Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..

ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ 400లో మరో రెండు ఎంట్రీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ విశ్వవిద్యాలయం 328వ ర్యాంక్ లో ఉండగా., అన్నా విశ్వవిద్యాలయం 383వ ర్యాంక్ ను కలిగి ఉన్నాయి.

Exit mobile version