NTV Telugu Site icon

Ap Elections 2024: కాయ్ రాజా కాయ్.. గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు

New Project (34)

New Project (34)

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై.. గోదావరి జిల్లాల్లో పందెపురాయళ్ళు పందాలకు తెగబడుతున్నారు. ఎన్నికలు అంటేనే పందాలరాయుళ్లకు పెద్ద పండుగ. సర్వేలు ఆధారంగా పందెం రాయుళ్లు వారి ట్రెండ్ ను మారుస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పందాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? అనేదానిపై ప్రధానంగా పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటూ ఆయా రాజకీయ పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ, మరి కొందరు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పందెం రాయళ్ళు కాలు దువ్వుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఉన్న ఎవరు ఎక్కువ స్థానాలు కైవాసం చేసుకుంటారనే దానిపై పందెం జోరుగా సాగుతుంది.

READ MORE: Fire Break : పెట్రోల్ బంక్ లోనే పేలిన లారీ డిజీల్ ట్యాంక్.. అతడే లేకుంటే..

కాగా.. ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు అయ్యింది. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. ఈ లోపు పందేం రాయుళ్ల హడావుడి మొదలైంది. సోషల్ మీడియాలో సర్వేలు వైరల్ అవుతుండగా వాటికి అనుగుణంగా పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో నగదు చేతులు మారే అవకాశం ఉంది. రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరువ్యాపారులు కూడా పందేలు వేస్తున్నట్లు సమాచారం. కాని రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మరో 14 రోజుల వేచి చూడాల్సిందే.