Site icon NTV Telugu

Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Aarogyasri

Aarogyasri

ఈ నెల 10 నుంచి తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తున్నారు. గత ఏడాది కాలంగా తమ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని నెట్ వర్క్ హాస్పిటల్ 10వ తేదీ డెడ్ లైన్ విధించాయి. పెండింగ్ బకాయిల వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తెలిపాయి. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో రూ. 675 కోట్లు బకాయిలు చెల్లించలేదని వెల్లడించాయి. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 920 కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీ కి చెల్లించింది.. ఇప్పటికీ ఇంకా రూ. 600 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. గతంలో ఫస్ట్ క్లెయిమ్ ఫస్ట్ పెమెంట్ ఉండేది. ప్రస్తుతం కేవలం ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. తమకు రెండు నెలలకు ఒక్కసారి మాత్రమే కొద్దిపాటి చెల్లింపులు చేయడంతో పెండింగ్ బకాయిలు ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నాయి.

READ MORE: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం

ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుందని అధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి రూ.10 లక్షలకు రేవంత్ రెడ్డి సర్కార్ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలులోకి వచ్చింది.

READ MORE: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం

Exit mobile version