NTV Telugu Site icon

School Timings Change: బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్‌..

School Bell

School Bell

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను తాజాగా పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు మొదలు కానున్నట్లు పేర్కొన్నది. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి తాజాగా పనివేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచి గతంలో కూడా 9 గంటలకే బడులు మొదలయ్యేవి. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి వాళ్ళ ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు. సినికి కారణం ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులుంటే.. ఒకరిని ఉదయం 9 గంటలకు, మరొకరిని ఉదయం 9:30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారని, కాబట్టి మార్చాలని అప్పట్లో కోరగా దాంతో బడి పనివేళలను మార్చారు.

Pakistan : పాకిస్తాన్‌లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు

కాకపోతే ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9 కే మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు మొదలు కానున్నాయి. సాయంత్రం 4:45 గంటల వరకు బదులు జరుగుతాయి. ఇక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మాత్రమే ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నడుపుతారు. 1- 7వ తరగతుల వరకు నిర్వహించే ప్రబుత్వత ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇక అలాగే ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు.

Pakistan : పాకిస్తాన్‌లో ముస్లిమేతరులపై క్రైస్తవులపై గుంపు దాడులు.. ఇళ్లు, ఫ్యాక్టరీలకు నిప్పు

ఇక అదే హైదరాబాద్‌ జంటనగరాల్లో మాత్రం ఈ స్కూళ్లను ఉదయం 8:45 గంటలకు మొదలై, సాయంత్రం 3:45 గంటల వరకు జరుగుతాయి. ఒకవేళ ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నట్లయితే ఆయా స్కూళ్లు ఉన్నత పాఠశాల వేళలనే పాటించాల్సి ఉంటుంది. అలంటి స్కూళ్లు కూడా ఉదయం 9:30గంటలకు మొదలుకానున్నాయి. ఇక మధ్యాహ్నభోజనం కోసం 45 నిమిషాల విరామం ఇచ్చారు అధికారులు.

Show comments