Site icon NTV Telugu

Local Body Elections: అదృష్టం అంటే ఈమెదే.. సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చింది

Local Elections

Local Elections

Local Body Elections: తెలంగాణలో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంతమందిని అదృష్టం వరించింది. రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా గ్రామాల్లో కొంతమందికి లక్కు కలిసి వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ పంచాయతీలో ఒకే ఇల్లు ఉండడంతో గతలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారే మరోసారి సర్పంచ్ గా మరోసారి ఎన్నిక కానున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గౌరారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సగం వార్డులు ఎస్టీలకు కేటాయించారు.

RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకల్లో మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాలకు అది ఓ హెచ్చరిక..!

అయితే, ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి, కొడుకు, కూతురు నివాసం ఉంటున్నారు. వారిలో తల్లి అంగన్వాడి టీచర్ గా ఉండగా.. కొడుకు జీపిఓ గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో పోటీకి రుద్రజారాణి ఒక్కరికే అర్హత ఉంది. గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితులు ఉండడంతో.. కాకా రుద్రజారాణి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయింది. 2019 ముందు పార్దసారధిపురం పంచాయతీలో గౌరారం కలిసి ఉండేది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో గౌరారం కొత్త పంచాయతీగా ఏర్పడింది. కొత్త పంచాయతీని ఎస్టీ కి రిజర్వ్ చేశారు.

Raju Gari Gadhi 4: మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన ‘రాజుగారి గది’.. సినిమా ఎప్పుడు వచ్చేదంటే?

దీనితో రుద్రజారాణి 20 ఏళ్లకే మొదటిసారిగా సర్పంచ్ గా ఎన్నికయింది. ప్రస్తుతం ఆమె టెట్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఆమె గత ఐదేళ్ళు సర్పంచ్ గా ఉండడంతో తమ గ్రామంలో అభివృద్ధి జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. గౌరారంలో సర్పంచ్ పదవిని ఎస్టీ జనరల్ గా ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఎస్టీలకు కేటాయించారు. గతసారి మాదిరిగానే ఈసారి కూడా రుద్రజా రాణినే వరించనుంది. గతంలో సర్పంచ్ పదవి మహిళకు కేటాయించగా రుద్రజారాణి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రివమయింది.

Exit mobile version