NTV Telugu Site icon

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మరో ఆరుగురు..

Road Accident

Road Accident

Road Accident: మధ్యప్రదేశ్‌ లోని ఛతర్‌ పూర్‌ లో మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 6 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛతర్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బాగేశ్వర్‌ ధామ్‌ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం ఉదయం 5 గంటల ప్రాంతంలో NH 39లోని కడారి సమీపంలో జరిగింది. భక్తులంతా ఆటోలో బాగేశ్వర్‌ ధామ్‌కు వెళ్తున్నారు. ఆటో నంబర్ UP95AT2421 ట్రక్కు (PB13BB6479)ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా.., అరడజను మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఇలాంటి అనేక రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి, ప్రజలు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటోడి అజాగ్రత్త వల్ల కూడా మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా గమ్య స్థానాలను చేరుకోండి.

Show comments