Site icon NTV Telugu

Immoral Relationship : నువ్వేమో ఎంజాయ్ చేశావ్.. ఆమెను నీ భార్యతోనే చంపించేశావ్

Extramarital Affair Vizag

Extramarital Affair Vizag

Immoral Relationship : ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమైపోతున్నాయి. అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సంబంధాలకు ఆడ మగ బేధం లేకుండా మరొకరితో శారీరక సుఖం పోయి కట్టుకున్న వాళ్లను మోసం చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త వివాహేతర సంబంధంతో విసిగిపోయిన ఆ మహిళ తన భర్త ప్రియురాలిని చాలా క్రమపద్ధతిలో హత్య చేసింది. తన భర్తను వదట్లేదన్న కోపంతో ఆమెను చంపేందుకు భార్య కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించింది. వారు తన భర్త, అతని ప్రియురాలిని పదే పదే కొట్టారు. ఆ తర్వాత కూడా ప్రియురాలు తన భర్తను వదల్లేదు. దీంతో ఆ మహిళ భర్త ప్రియురాలిని హతమార్చింది. మహిళ మృతదేహం లభ్యమైన తొమ్మిది రోజుల తర్వాత కుట్ర బయటపడింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు.

Read Also: Gangamma Jathara: చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర

వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర షా, మీనా దేవి ఇద్దరు దంపతులు. వీరి పెళ్లి తర్వాత చాలా కాలానికి రాజేంద్ర షాకు కుంతీదేవితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది. దీనిని జీర్ణించుకోలేని మీనా దేవి తన భర్తను నిలదీసింది. కాంట్రాక్ట్ ఇచ్చి మరి మనుషులను పెట్టి ఇద్దరినీ కొట్టించింది. అయినా వారు మారకపోవడంతో చంపాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే చేసి చూపింది. భర్త ప్రియురాలని హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మహిళ మృతదేహాన్ని అడవిలో పడేశారు. పోలీసులు వేగంగా దర్యాప్తు నిర్వహించారు. తొమ్మిది రోజుల్లోనే హత్య ఉదంతాన్ని బహిర్గతం చేశారు. ఈ ఘటన బాగోదర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 28న దోభచన్ అడవుల్లో చెట్టుకు కట్టివేయబడిన మహిళ మృతదేహం లభ్యమైంది.రాజేంద్ర షా ఫిర్యాదు మేరకు బాగోదర్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు గిరిదిహ్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ రేణు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం మహిళ హత్య వెనుక షాకింగ్ కారణాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

Read Also:Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే అపవాదులు దూరమై అనుకున్న పనులు నెరవేరుతాయి.

కేసు విచారణ కొనసాగుతుండగా, కుంతిని చంపేందుకు మీనా దేవి పథకం వేసినట్లు వెలుగులోకి వచ్చింది. కుంతిని చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్ అజయ్ కుమార్‌కు మీనా డబ్బు ఇచ్చింది. ఈ కేసులో మీనా, అజయ్ కుమార్ ఇద్దరినీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆరుగురు నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఓ మైనర్ నిందితుడు కూడా ఉన్నాడు.

Exit mobile version