IND vs BAN: ఆదివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. మహ్మద్ శిబాబ్ 40 పరుగులు, మహ్మద్ ఫరీద్ 39 పరుగులు చేశారు. జవాద్ అబ్రార్ 20 పరుగులు, అజీజుల్ హకీమ్ తమీమ్ 16 పరుగులు చేశారు. హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: ABC Juice: ABC జ్యూస్ గురించి తెలుసా మీకు? ఈ తాగితే ఎన్ని లాభాలో
అయితే లక్ష్య ఛేదనలో మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు 35.2 ఓవర్లలో కేవలం 139 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున కెప్టెన్ అమన్ అత్యధిక పరుగులు చేశాడు. 65 బంతుల్లో ఒక ఫోర్‌తో 26 పరుగులు చేసాడు. 199 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభం సరిగా లభించలేదు. ఓపెనర్లు ఆయుష్ మ్హత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) చౌకగా పెవిలియన్‌కు చేరుకున్నారు. దీని తర్వాత భారత్ వికెట్ల పతనం ఆగలేదు. దాంతో 73 పరుగుల వద్ద భారత జట్టులో సగం బ్యాట్స్మెన్స్ పెవిలియన్‌కు చేరుకున్నారు. లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ రాజ్ (24) రాణించిన అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు భారత ఆటగాళ్లు రెండంకెల స్కోర్ ను చేరుకోలేకపోయారు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ లో కెప్టెన్ మహ్మద్ అజీజుల్ హకీమ్ తమీమ్, మహ్మద్ ఇక్బాల్ హసన్ ఎమోన్ చెరో మూడు వికెట్లు తీశారు. 11వ ఎడిషన్ టోర్నీలో మహ్మద్ అమన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా, సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను ఓడించింది.