India Women vs NZ Women: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించాలని కోరుకుంటోంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఇది నాలుగో మ్యాచ్ కాగా, న్యూజిలాండ్ కు కూడా తొలి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Narhari Zirwal: భవనంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!
మహిళల T20 ప్రపంచకప్ 2024లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ శుక్రవారం, అక్టోబర్ 04న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అయితే దీని లైవ్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే.. గణాంకాలు ఎక్కువగా న్యూజిలాండ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 13 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 9 విజయాలు సాధించగా, భారత్ కేవలం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
KTR Tweet: రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
భారత జట్టు:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతీ రెడ్డి, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, దయాళన్ హేమలత, యస్తిక భత్యా, ఎస్ సజ్నా, ఎస్. శోభన.
న్యూజిలాండ్ జట్టు:
సుజీ బేట్స్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (సి), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్ (వారం), హన్నా రోవ్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్, లీ తహుహు, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్ .