NTV Telugu Site icon

HIT The 3rd Case: గెట్.. సెట్.. గో.. అర్జున్ సర్కార్ గా నాని అదుర్స్..

Hit 3

Hit 3

HIT The 3rd Case: హిట్, హిట్ 2 చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. ప్రస్తుతం నాని హీరోగా హిట్ 3 చిత్రాన్ని తెరకెక్కించేస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో భారీ హీట్ ను అందుకున్న హీరో నాని తన తర్వాత సినిమా హిట్ 3 సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు. హిట్ 3 సినిమా సంబంధించిన టీజర్ లో హీరో నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. తనదైన సహజమైన నటనతో పోలీస్ పాత్రలో అలరించేందుకు నాని సిద్ధమయ్యాడు. విడుదలైన టీజర్ లో రోడ్డు మీద వెళ్తున్న వాహనంలో ఆఫీసర్ వెళ్తున్నారా అని అడగగా.. అవును అని సమాధానంతో అతడికి ప్రమాదం పొంచి ఉంది వెంటనే వెనక్కి రమ్మని చెప్పండి అని చెప్పగా.. అందుకు సమాధానంగా మీరు ప్రమాదం ఉందనుకుంటున్నారో.. అతనే ఒక ప్రమాదం అని చెబుతూ నాని మాస్ లుక్ ను రిలీవ్ చేశారు. ఇక నాని క్యారెక్టర్ ను అర్జున్ సర్కారుగా చూపించారు. ఇక ఈ సినిమాను 01 మే 2025 విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నం చేస్తుంది.

Pranitha Subhash: రెండోసారి తల్లైన హీరోయిన్ ప్రణీత.. పిక్ వైరల్!

ఇక సినిమా సంబంధించిన కాస్ట్ & క్రూ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని ‘అర్జున్ సర్కార్’ గా నటించారు. డాక్టర్ శైలేష్ కోలాను రచయిత, దర్శకుడుగా ఉన్నారు. ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా & ఏకగ్రీవ నిర్మాణాలు బ్యానర్ల పై సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా శాను జాన్ వర్గీస్, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎస్. వెంకట రత్నం (వెంకట్), పిఆర్ఓ గా వంశీ శేఖర్, మార్కెటింగ్ ను ఫస్ట్ షో పబ్లిసిటీ, డిజైన్స్ ను సౌందర్య కుంజమ్మ బాధ్యతలు చేపట్టారు.

Show comments