NTV Telugu Site icon

Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది..

Anjali

Anjali

హీరోయిన్ అంజలి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ను చూసిన ట్రైలర్ కట్ అదిరింది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Game Changer: గేమ్ చేంజర్లో అలాంటి పాత్ర.. అంజలి లీక్ చేసేసిందిగా..!

ఇది ఇలా ఉండగా అంజలి మాట ఒక బూతు మాట పలికించడం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇదే విషయాన్ని అంజలి దృష్టికి తీసుక వెళ్లగా తనకు కథ చెప్పినప్పుడే ఈ పాత్రతో బూతులు మాట్లాడిస్తానని దర్శకుడు చెప్పాడని తెల్పింది. అయితే అనుకున్నవన్నీ తెరమీదకు రావు కదా.. అనుకుని సినిమా మొదలుపెట్టాం షూట్ చేస్తున్న సమయంలో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత డబ్బింగ్ సమయంలో తీసేస్తారేమో.. సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి కదా అనుకున్నాను. అయితే డబ్బింగ్ లో కూడా నా చేత చెప్పించారు. అలాగే ట్రైలర్ లో కూడా అదే బూతు మాట మీకు వినిపించింది. అయితే ట్రైలర్ కి సెన్సార్ ఉండదు కాబట్టి ఇప్పుడు వినిపించింది. కానీ, సెన్సార్ బోర్డు వాళ్ళు బహుశా ఆ పదాన్ని తప్పించవచ్చేమో అంటూ ఆమె కామెంట్ చేసింది.

Anjali Marriage: తన పెళ్లి పుకార్ల పై స్పందించిన హీరోయిన్ అంజలి..

Show comments