Site icon NTV Telugu

Immoral Relation : కూతురును వదిలేశాడు.. అత్త కత్తిలా ఉందని కన్నేశాడు.. కాటికి పోయాడు

New Project

New Project

Immoral Relation : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యను అల్లుడుతో ఆ స్థితిలో చూసి ఆగ్రహించిన భర్త హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. భార్యను చంపిన అనంతరం అల్లుడుపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అయితే అతడు తృటిలో గాయాలతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనానంతరం నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అరెస్టయిన నిందితుడి పేరు చందన్ మెష్రామ్.

Read Also : Anakapalle Crime: చార్జింగ్‌ తీయకుండా ఫోన్‌ మాట్లాడాడు.. ప్రాణాలు కోల్పోయాడు

వివరాల్లోకి వెళితే.. చందన్ మెష్రామ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని పెద్ద కుమార్తె జునాపరాకు చెందిన సంజుతో వివాహం జరిగింది. కూతురి పెళ్లి తర్వాత అత్తగారు అమ్రికిబాయి, అల్లుడు సంజుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కాగా, చందన్ బుధవారం మధ్యాహ్నం తన పొలానికి చేరుకున్నాడు. అక్కడ అతని భార్య తన అల్లుడు సంజుతో అసహ్యకరమైన స్థితిలో ఉంది. ఇది చూసి సహనం కోల్పోయి పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని ఇద్దరిపై దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, సంజు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని తీసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సంజు ఆసుపత్రిలో చేరాడు.

Read Also : Ileana: తొలిసారి బేబీ బంప్ తో ఇలియానా.. ఇప్పటికైనా చెప్పు ఆ బిడ్డకు తండ్రి ఎవరు..?

పోలీసుల విచారణలో, తన అల్లుడు సంజు అంటే తనకు ఇంతకు ముందే ఇష్టం లేదని నిందితుడు చెప్పాడు. తన కూతురు లలితను పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. అయితే సంజు మొదట తన కూతురిని ప్రేమ వలలో వేసి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత సంజు, అమ్మాయి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుకున్నాడు. ఇదిలావుండగా సంజు రహస్యంగా తన ఇంటికి వచ్చి భార్యను కలిసేవాడిని తెలిసింది.

Exit mobile version