NTV Telugu Site icon

ATM Withdrawal: క్రేజీ.. రూ. 5,000 డ్రా చేస్తే రూ.7,000 ఇస్తున్న ఏటీఎం.. ఎక్కడంటే.?

Sbi

Sbi

ATM Withdrawal: ఆటో టెల్లర్ మిషన్.. ఈ పేరు వింటే చాలామంది ఇది ఏంటి అని అడిగేవారు ఎందరో. అదే ఏటీఎం అని చెప్పండి సులువుగా గుర్తుపట్టేస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నట్లయితే మీరు కావలసిన సమయంలో ఈ ఏటీఎం మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకొని మనం ఉపయోగించుకొనే విధంగా బ్యాంకులు ఏర్పాటు చేశాయి. అయితే మనిషి తప్పు చేసినట్లుగానే అప్పుడప్పుడు యంత్రాలు కూడా పాడవడం వల్ల తప్పులు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం. ముఖ్యంగా చాలాసార్లు ఏటీఎంలలో ఇబ్బందులు పడిన సంఘటనలు చాలానే మీడియా ద్వారా చూసే ఉంటాము. తాజాగా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లోని ఎస్బిఐ ఎటిఎంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Dragon Fruits: అయ్యబాబోయ్.. డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇన్ని లాభాలా.?

నగరంలోని ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లగా.. అక్కడ అతను 5000 డ్రా చేయగా.. అక్కడ అతనికి ఐదువేలకు బదులుగా 7000 రూపాయలు విత్ డ్రా అయ్యాయి. అయితే దాని ఏమైనా తప్పుగా నొక్కి ఉంటే 7000 విత్ డ్రా అయ్యాయేమో అని అనుమానం వచ్చిన అతడు అతనికి వచ్చిన రసీదును పరిశీలనగా చూడగా అక్కడ కూడా కేవలం 5000 విత్ డ్రా చేసినట్లుగానే చూపించింది. దాంతో ఆశ్చర్యపైన అతను మరోసారి 5000 రూపాయలను విత్ డ్రా చేయగా మళ్లీ 7,000 వచ్చాయి. ఇంకేముంది అతడు తన వాళ్లకు కూడా ఆ విషయాన్ని చేరవేయడంతో చాలామంది అక్కడికి వచ్చి డబ్బులు విత్ డ్రా చేయగా 2000 రూపాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చివరికి ఈ విషయం నగరంలోని చాలామందికి తెలియడంతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయడానికి వచ్చారు. అయితే ఓ ఏటీఎం నుండి ఎడతెరిపి లేకుండా డబ్బులు విత్ డ్రా అవుతుందని బ్యాంకు అధికారులకు డౌట్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్లి సమస్యను చెక్ చేయగా.. అక్కడ తేడా జరుగుతున్నట్లు గమనించారు. దాంతో అక్కడ ఉన్న ప్రజల్ని అధికారులు పక్కకు జరిపి ఏటీఎంని మరోసారి టెస్ట్ చేశారు. వారికి కూడా అదే జరగడంతో వెంటనే ఏటీఎంను మూసేశారు.

Insomnia: నిద్రలేమి సమస్యకు కారణాలు ఏంటో తెలుసా.?

ఇక ఈ పరిస్థితిపై ఓ బ్యాంక్ అధికారి మాట్లాడుతూ.. ఇది ఆర్థిక నేరం కాదు.. ప్రజలు కావాలని చేసింది అంతకంటే కాదు.. కానీ, డబ్బులు తక్కువగా వస్తే మాత్రం కంప్లైంట్ ఇచ్చే కస్టమర్లు.. ఒకవేళ పొరపాటుగా ఎక్కువగా వస్తే అలాగే కంప్లైంట్ ఇవ్వాలని కోరారు. అలా చేయడం మానేసి డబ్బులు విత్తుట్రా చేయడం అనేది నేరమే అవుతుందంటూ అతడు తెలిపాడు. ఈ సమస్యకు సంబంధించి ఎవరైతే డబ్బులు విత్ డ్రా చేశారో ఆయా కస్టమర్లతో బ్యాంక్ అధికారులు మాట్లాడి సమస్యను సెటిల్ చేస్తామని తెలియజేశారు. ఎవరైతే డబ్బులు ఎక్కువగా తీసుకున్నారు వారి అకౌంట్లో ఆ డబ్బులు డెబిట్ చేస్తామని అధికారులు తెలుపుతున్నారు.